“స్వస్థపరచడం” యొక్క అర్ధం, నిఘంటువు ప్రకారం, గాయం లేదా వ్యాధి నుండి విముక్తి పొందడం, మళ్ళీ బాగుపడటం, మంచి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం, పూర్వపు స్వచ్ఛత లేదా సమగ్రతను పునరుద్ధరించడం.

యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు, స్వస్థవరచుట అనే పరిచర్యను అనేక సార్లు మనము గమనించగలము. థెరాప్యూ అనే గ్రీకు పదం నుండి థెరపీ అనే ఆంగ్లపదం ఉద్భవించింది. దాని అర్ధం, అంటే “రుగ్మత నుండి ఉపశమనం లేదా నయం చేయడానికి ఉద్దేశించిన చికిత్స”. ఇది రోగి కొరకైన ప్రార్ధనల ద్వారా, సంఘమునకు ఇచ్చిన ఆత్మీయ వరముల ద్వారా, ప్రభువు చేత జరిగించబడుతుంది. 

ఈ పరిచర్యలో తన చిత్తప్రకారం కొన్నిసార్లు ప్రభువు అద్భుతాలను జరిగించవచ్చు, అయితే సంఘముకొరకై కొన్ని మౌలిక విధానాలు ప్రభువు ఏర్పరిచారు. సహవాసము కలిగియుండుట, సహోదరులు ప్రేమ మరియు కనికరము కలిగియుండుట, స్వస్థత అవసరమైన సహోదరుల కొరకు విజ్ఞాపనలో కనిపెట్టే ఓపిక కలిగియుండుట వాటిలో కొన్ని విషయాలు. స్వస్థపరిచేవాడు ప్రభువే అని మేము ఖచ్చితంగా విశ్వసిస్తాము. ఈ పరిచర్య పొందిన వారు, ప్రభువునుండి సూచనలు, హెచ్చరికలు, ప్రవచనాత్మకమైన నడిపింపు ప్రకారంగా, విశ్వాసులకు మరియు ప్రభువుకు మధ్య పనిచేస్తారు. మత్తయి 10:8 లో స్పష్టంగా ఈ పరిచర్య గురించి శిష్యులకు తెలియచేయడము చూడగలము.

రోగులను స్వస్థపరచుడి, చనిపోయినవారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్లగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి – మత్తయి 10:8. తరువాత అపొస్తలుల కార్యములలో, “అంతట పేతురు–వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పెను- అపొస్తలుల కార్యములు 3:6”.

బింకం గాస్పెల్ వర్క్స్, దేవుడు ఏర్పరిచిన స్వస్థత పరిచర్యను విశ్వసించి, జాగ్రత్త కలిగి, నమ్మకంగా మరియు ప్రార్ధనాపూర్వకంగా చేయుటకొరకు కట్టుబడిఉంది. అంతేకాక, రోగులకొరకు ప్రార్ధించుట అనే పరిచర్య చాలా ఎక్కువగా ప్రతీ సహవాసములోను జరిగేదే మరియు స్వస్థత పరిచర్యలో ఒక ముఖ్య భాగము కూడా.