ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం “Preaching” యొక్క అర్ధం ఏమిటంటే, ఒక నిర్దిష్ట మతం, జీవన విధానం, వ్యవస్థ మొదలైన వాటి గురించి ప్రజలకు చెప్పడం, దానిని అంగీకరించమని వారిని ఒప్పించడం. అయితే బైబిల్లో వాడబడిన గ్రీక్ మాటకు అర్ధం “ప్రకటించుట”. అదికూడా, ఒక రాజ్యపు ఆస్థాన సమాచార ప్రకటన అధికారి వలే, అధికారముతో ప్రకటించుట. మన సమకాలీన రాజ్యములలో ఇతని పరిధి ఏమిటంటే, (చారిత్రాత్మకంగా) ప్రకటనలు చేయడం, అధికారిక సందేశాలను తీసుకెళ్ళడం. దీనిని బట్టి మన ఈ క్రింది విధంగా అర్ధంచేసుకోవచ్చు.

  • ప్రకటించడం దేవుని రాజ్యం యొక్క అధికారిక ఏర్పాటు.
  • పరలోక రాజ్యాన్ని ప్రకటించడం, రాబోయే విషయాల కొరకైన సాక్ష్యము.
  • ప్రకటించడానికి దేవుడు నియమించిన ప్రజలు, రాజ్య సువార్త యొక్క అధికారిక ప్రకటనదారులు.

“ప్రకటించడం” అనే పరిచర్యను గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు, విశ్వాసుల జీవితంలో మరియు ప్రపంచం లో ఇది చాలా ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో, తార్కిక, శాస్త్రీయ మరియు విశ్లేషణాత్మక విధానాలే ఏదైనా నమ్మడానికి ఒక ప్రమాణంగా మారినప్పుడు, దేవుని రాజ్యం గురించి దేవుని ప్రజలకు మరియు ఇతరులకు వెల్లడించడం ఒక ముఖ్యమైన పని మరియు ఇది ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ద్వారా ఏర్పరచబడిన పని .

సువార్త బోధించినప్పుడు లేదా ప్రకటించినప్పుడు అది విన్నవారికి, అంగీకరించినవారికి దేవుని ద్వారా అందజేయబడిన ఒక అధికారిక ఉత్తర్వు.  తదనుగుణంగా వారి జీవితాలను సరిచేసుకోవడానికి,  జరుగుతున్న సంఘటనల ద్వారా సత్యాన్ని గమనించడానికి ఇవ్వబడిన అవకాశం. 

బింకం గాస్పెల్ వర్క్స్ దేవుని రాజ్యాన్ని అధికారం మరియు చిత్తశుద్ధితో బోధించడానికి కట్టుబడి ఉంది. 

పర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడి (మత్తయి 4: 17), యేసు ఇలా చెప్పెను … నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు (యోహాను 14: 6) . ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును (రోమా 10:13), మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను (అపొస్తలుల కార్యములు 2:36), మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు (అపొస్తలుల కార్యములు 2:38)