మీ అవసరాలు దేవునికి తెలుసు

మీ అవసరాలు దేవునికి తెలుసు. దేవునికి మన అవసరాలు తెలుసు అని తెలుసుకోవడం ఎంత సంతృప్తినిస్తుంది? ఆదికాండము 2:18 లో దేవుడు ఇలా చెప్పాడు, “మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు; నేను అతనికి సాటి అయిన సహాయాన్ని చేస్తాను.” అని

నేలమంటి నుండి దేవుడు జంతువులను మరియు పక్షులను సృష్టించాడు. దేవుడు ఈ జంతువులను మరియు పక్షులను మగదిగాను మరియు ఆడుదిగాని సృష్టించాడు. వాటికి ఇచ్చిన బాధ్యతలు తదుపరి తరాన్ని పునరుత్పత్తి చేయడం మరియు వారి కుటుంబాలను చూసుకోవడం అంతే. మరే ఇతర జంతువు లేదా పక్షికి సంబంధించి వారికి ఇతర బాధ్యతలు లేవు.

కానీ దేవుడు మనిషిని ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో సృష్టించాడు. మనిషి తన స్వరూపంలో ఉండాలని ఆయన కోరుకున్నాడు. కేవలం రూపాన్ని మాత్రమే కాకుండా, “జీవాన్ని” పోషించి, రక్షించగల సామర్థ్యం కూడా. అందుకే ఆయన భూమిని నిండించమని మరియు దానిని లోబరుచుకోమని మనిషికి చెప్పాడు (ఆదికాండము 1:28).

దేవుడు జీవులను సృష్టించినప్పుడు, అతను వాటిని మగదిగాను మరియు ఆడుదిగాని. కానీ మనిషిని సృష్టించేటప్పుడు స్త్రీ మరియు పురుషుల మధ్య సమయ వ్యత్యాసం ఉంది. అలా చేయడం వెనుక ఒక ఉద్దేశ్యం ఉంది. ఇది మనిషి జీవితంలో “స్త్రీ” యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దేవుని దృష్టిలో స్త్రీకి నిర్వచనం, పురుషునికి “సాటి అయిన సహాయం”. హిబ్రూ లో ఉపయోగించిన అసలు పదం עֵזֶר (అయ్’-జెర్) ఈ పదానికి అర్థం సహాయం. అంటే, మనిషికి దేవుడు నియమించిన అన్ని బాధ్యతలను నెరవేర్చడానికి, స్త్రీ సహాయం చేయడం మరియు మద్దతు ఇవ్వడం ద్వారా పనులను సులభతరం చేస్తుంది. ఆదికాండము 2:24 భార్య పాత్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

అదే విధంగా, విశ్వాసి ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవునికి తెలుసు. అందుకే ఆయన పరిశుద్ధ ఆత్మను ఆదరణకర్తగాను, సహాయకుడిగా పంపాడు. విశ్వాసి ప్రభువైన యేసుక్రీస్తు స్వరూపంగా మారడానికి పరిశుద్ధాత్మ సహాయం ఖచ్చితంగా అవసరం.

మన రోజువారీ జీవితంలో కూడా, మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు దేవునికి తెలుసు. ఆయనకి మన అవసరాలు,బలహీనతలు, లోటుపాట్లు మొదలైనవి తెలుసు. ఆయన అవసరమైన విధంగా సహాయాన్ని ఏర్పాటు చేస్తాడు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, మనకు తెలియని సహాయములు, యజమాన్యం నుండి సహాయాలు, సహోద్యోగుల నుండి మద్దతు, పొరుగువారి సహాయం మరియు అనేక ఇతర తెలియని మరియు ఊహించని రూపాల్లో సహాయం మరియు మద్దతు, దేవునిచేత ఇవ్వబడుతుంది. ఆయన ప్రేమ ఎంత గొప్పది? అందుకే నమ్మండి మీ అవసరాలు దేవునికి తెలుసు.

ప్రార్థన: ప్రియమైన పరలోకపు తండ్రీ, మమ్మల్ని ప్రేమించినందుకు మరియు మమ్మల్ని కాపడుతున్నందుకు ధన్యవాదాలు. మా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు ధన్యవాదాలు. మాకు ఏమి కావాలో మరియు ఎప్పుడు అవసరమో మీకు ఖచ్చితంగా తెలుసు. మా సహాయం కోసం మీ ప్రణాళికల ప్రకారం వివిధ వ్యక్తులతో మమ్మల్ని జతపరిచినందుకు ధన్యవాదాలు. మా ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేయడానికి పరిపూర్ణ సహాయకునిగా పరిశుద్ధాత్మను ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా ప్రభువు మరియు రక్షకుడు యేసుక్రీస్తు పేరిట మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము, ఆమెన్.